సాదాబైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: సాదా బైనామాల పరిశీలనపై తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదాబైనామాల క్రమబద్దీకరణపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు వచ్చిన దరఖాస్తులను పరిశీలించవచ్చని ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్దీకరణ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టానికి ముందు దరఖాస్తులను పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది. అక్టోబర్‌ 29 నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. అక్టోబర్‌ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయన్నారు. అక్టోబర్‌ 29 నుంచి నిన్నటి వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయన్నారు. కౌంటర్‌ దాఖలుకు అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్ రెండు వారాల గడువు కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 6,74,201 దరఖాస్తులు పరిశీలించవద్దని హైకోర్టు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.