జమిలి ఎన్నికలపై జనసేనాని కీలక వ్యాఖ్యలు

హైద‌రాబాద్‌: జమిలి ఎన్నికలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకొచ్చిన సమాచారం ప్రకారం దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని పవన్‌ జోస్యం చెప్పారు. 2024 కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాలు కూడా ఇదే కోరుకుంటున్నాయని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని తెలిపారు.

ఈ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… 2024 కంటే ముందుగానే ఎన్నికలు రాబోతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.. దీంతో.. పవన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ తరుణంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.