సినీ పరిశ్రమపై కేసీఆర్ వరాల జల్లు

‌హైద‌రాబాద్: క‌రోనాతో కుదేలై ఆర్దికంగా న‌ష్ట‌పోయిన సినిమా రంగంపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. 10 కోట్లు లోపు నిర్మించే సినిమాలకు GST రేయంబర్స్మెంట్… అలాగే థియేటర్ వారి ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా టికెట్ రేట్స్ థియేటర్స్ యాజమాన్యం వారి ఇష్టప్రకారం పెంచుకునేందుకు అనుమతించారు. అదే విధంగా 6 నెలలు థియేటర్లు లో కరెంట్ బిల్లు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ఈ నిర్ణయాలు థియేటర్స్ యాజమాన్యానికి చాలా లాభం చేకూరుస్తాయి. రాష్ట్రంలోని అన్ని ర‌కాల సినిమా థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను (షోలను) పెంచుకునేందుకు అనుమ‌తి ఇస్తాం. మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, ఢిల్లీల‌లో ఉన్న విధంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును క‌ల్పిస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.