ఇక.. ఈ-సిమ్ కార్డులు!

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచం నిజంగానే అరచేతిలో ఉంది. అదేనండి మొబైల్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్టే.. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. భారత టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్తుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పెద్ద పరిమాణంలో ఉండే సాధారణ సిమ్ కార్డుల స్థానంలో మైక్రో సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు కొత్తగా ఈ-సిమ్ కార్డులు రానున్నాయి. దీని ద్వారా భౌతికంగా సిమ్ అవసరం లేకుండానే టెలికాం సబ్స్క్రిప్షన్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఈ-సిమ్‌కు సపోర్ట్ చేసే డివైస్‌లలోనే ఇది పని చేస్తుంది. ఈ డివైస్‌లలో ఈ-సిమ్ ప్రొఫైల్‌ను డిజిటల్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలికాం మార్కెట్లో కొత్త సంస్థల ఎంట్రీతో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ పోతున్న సంగతి తెలిసిందే. ఇక, కొత్త టెక్నాలజీని వెంటనే అప్డేట్ చేసుకోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఈ సిమ్ కార్డుల సర్వీసులను మొదటగా.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐ సంస్థలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి.