30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్‌ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్‌ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది.

Leave A Reply

Your email address will not be published.