హార్దిక్‌ బాదుడు.. టీమిండియాదే సిరీస్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో మొదట వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియా… టీ-20 సిరీస్‌ను మాత్రం కసితో తన ఖాతాలో వేసుకుంది. తొలి టీ-20 మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన కోహ్లీ సేన ఆసీస్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లోనూ సూపర్ విక్టరీ కొట్టింది. ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించిన భారత్ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. ఇక, దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది టీమిండియా.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) లు ణించి జట్టును గెలిపించారు.

42 పరుగులతో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. టీ20ల్లో విదేశాల్లో భారత్‌కు ఇది వ‌రుస‌గా ప‌దో విజ‌యం కావ‌డం మరో విశేషం.

Leave A Reply

Your email address will not be published.