రేపటి ఓయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : భారత్ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరుగనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథావిధిగా కొనసాగుతాయని వర్సిటీ తెలిపింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు మంగళవారం భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా వర్సిటీ పరీక్షలను వాయిదా వేసింది.