క్రికెట్‌కు పార్థివ్ పటేల్ గుడ్ బై

న్యూఢిల్లీ: ఇండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు పార్థివ్. 35 ఏళ్ల పార్థివ్.. ఇండియా తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ 20లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో గుజరాత్ తరఫున 194 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పార్థివ్… బుధవారం ట్విట్టర్ వేదికగా తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ 18 ఏళ్ల తన కెరీర్లో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు పార్థివ్. 2002 లో తొలిసారి ఇండియన్ టీం తరఫున ఆడిన పార్థివ్…టెస్టుల్లో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో పార్థివ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు.