బొప్పాయి – ఔషధ గుణాలు

బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయి పండుతో పాటుగా దీని కాయలు, ఆకులు, బొప్పాయి కాయ మరియు చెట్టునుండి కారే పాలు చాలా ఔషధ గుణాలు కలిగి వున్నాయి .

ప్ర‌యోజ‌నాలు

  • కొందరికి కడుపులో కంతులు ( Tumors) పెరిగి ఇబ్బంది పెడుతుంది. పచ్చి బొప్పాయి పొట్టు తో పాటు ముక్కల్ని కోసి కొన్ని అరటిపండు ముక్కలు కూడా వేసి తియ్యని పెరుగు కలిపి మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి తయారు చేసిన మిశ్రమాన్ని త్రాగితే చిన్న ప్రేవుల్లో కంతులు పెరగకుండా కాపాడుతుంది. దీనివల్ల మంచి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
  • బొప్పాయి పండు తింటే బాలింతలకు పాలు పడతాయి.
  • సెగ గడ్డలు వస్తే బొప్పాయి ఆకులపైన నువ్వుల నూనె రాసి వెచ్చచేసి గడ్డలపై కడితే అవి తగ్గి పోతాయి.
  • బొప్పాయి పాలను అంటించితే పంటినొప్పి తగ్గిపోతుంది.
  • బొప్పాయి పాలను పులిపిరులపయి రాస్తే అవి రాలి పోతాయి.
  • బొ ప్పాయి గింజల పొడిలో తేనె కలిపి చిన్న పిల్లలకు త్రాగిస్తే నులి పురుగులను రానివ్వదు. ఒకవేళ ఉంటే పడి పోతాయి.
  • బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్‌ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్‌ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.
  • ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
  • మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.
  • ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
  • బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.
  • బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివీ తగ్గుతాయి.
  • బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
  • పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.
  • బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ తగ్గుతాయి.
  • బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.

-పూర్ణిమ‌

Leave A Reply

Your email address will not be published.