పెళ్లికూతురు రెడీ..

మెగా బ్రదర్‌, నటుడు నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్లికుమార్తెగా ముస్తాబయ్యారు.. నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబ‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  ‘కొణిదెల వారి ముద్దుల తనయ నేటితో జొన్నలగడ్డ ఇంటి కోడలు కాబోతుంది. ఈరోజు రాత్రి 7.15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో జరుగనున్న వీరి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.