టి.వేదాంత సూరి: బిగ్ బాస్ తరువాత కథ వేరేవుంటది..
తెలుగులో బిగ్ బాస్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. గతంలో మూడు సీజన్లు ఒకలా ఉంటే కరోనా సమయంలో ఇప్పుడు వస్తున్నా నాలుగో సీసన్ అందరిని ఆకట్టుకుంటుంది. ఫలితంగా టి.ఆర్.పి రేట్ కూడా బాగా పెరిగింది. ఈ సరి బిగ్ బాస్ కొత్త ఆలోచనలతో మొదలు పెట్టారు.. అరవై ఏళ్ళ గంగవ్వను ఎంపిక చేయడం ఒక ప్రత్యేకం. కాగా అందులో చాలా మందివి కొత్త ముఖాలే. వారందరికీ ఇప్పుడు బిగ్ బాస్ ఒక కొత్త దారి చూపిస్తున్నారు. కప్ ఒక్కరికే దక్కినా, ఆ తరువాతి ఫలితాలు మాత్రం అనూహ్యంగా ఉండ బోతున్నాయి. బిగ్ బాస్ ఆలోచనే ఒక కొత్త తరహాది, ఒక బ్రిటిష్ రచయిత రాసిన నవలకు దృశ్య రూపమే ఇది, దీన్ని తోలి సరిగా నెదర్లాండ్ లో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం ప్రపంచం లోని చాలా భాషలలో దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇండియాలో కూడా హిందీ, కన్నడ, తమిళ్ తో పాటు తెలుగులో మంచి ప్రజాదరణ పొందుతుంది.
ఎలాంటి సాంకేతిక సౌకర్యాలు లేకుండా ఒక వ్యక్తి సమాజంలో ఎలా ఉంటాడు, వారి వ్యక్తిత్వం ఏమిటి, ఎలా ఉంటుంది, ఆటు పోట్లు ఎలా అధిగమించాలి ఎవరితో ఎలా సర్దుకు పోవాలి, ఎప్పుడు ఏ మాట అనాలి, ఏది అనకూడదు, స్నేహం, చొరవ, ప్రేమ, కోపం, వంటివి ఎలా ఉంటాయి ఇందులో స్పష్టంగా తెలుస్తాయి.
మరో రెండు రోజుల్లో తెలుగు బిగ్ బాస్ సీజన్ పూర్తి కావస్తుంది. మొదటి సీజన్ లో తెలంగాణ నుంచి వచ్చిన వారిని కొందరు యెగతాళి చేసారు, మూడో సీజన్ లో శివజ్యోతి, అలిరాజా, రాహుల్ లు దుమ్ము రేపారు, రాహుల్ కప్ అందుకున్నాడు. ఇక ఈసారి ఆట చివరికి వచ్చిన ఐదుగురు తెలంగాణ వారే కావడం విశేషం, ఎవరికి కప్ వచ్చినా అది తెలంగాణకే చెందుతుంది. ప్రస్తుతం అభిజిత్, అఖిల్, సోహెల్ ,హారిక, అరియనాలు మిగిలారు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత, అభిజిత్ మైండ్ గేమ్ ఆడుతాడు, అఖిల్ ప్రేమ, అలక, ఆప్యాయతలతో పాటు ఆట కూడా బాగా ఆడతాడు, సోహెల్ స్నేహానికి ఏది ఇవ్వడానికైనా వెనుకాడడు, హారిక ఆలోచన కొత్త తరహాలో ఉంటుంది. ఆటు పోట్లు ఎన్ని ఎదురైనా తట్టుకుని ఉంటుంది. అరియనా రోజు రోజుకు తన ప్రతిభను నిరూపించు కుంటూ వచ్చింది.
ఇది ఇలా ఉంటే ఓటు వేసేవారు నిజాయితీగా లేరు, అదొక మాఫియా గా మారింది, ఏమీ ఆడకుండా, మైండ్ గేమ్ తో సరి పెట్టుకుని కెమెరా ల ముందు ఏం చేయాలి , అంటూ ఆలోచించే వారికి మాత్రమే ఓటు వేస్తున్నారు, దీని వలన నిజాయితీ గా ఆడే వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఏది ఎలా వున్నా, కోపాలు కేవలం ఆట వరకే పరిమితం చేసి మిగతా సమయం లో ప్రేమగా ఉండటం ఈసారి అందరి ప్రత్యేకత. ఎక్కడా శత్రుత్వం లేదు, ఎక్కడా భిన్న భావాలు లేవు, అదే తెలంగాణ నేల ప్రత్యేకత కావచ్చు. ఒక గంగవ్వ, ఒక సోహెల్, హారిక, హరియాణా, సుజాత ఎందరి గుండెలనో కొల్ల గొట్టారు..
అందరికి అల్ ది బెస్ట్.
-టి.వేదాంత సూరి