మాస్క్ ధరించకపోతో రూ.1000 జరిమానా
3 రోజుల్లోనే 24 దేశాలకు ఒమిక్రాన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ కట్టడి చర్యలలో భాగంగా మాస్క్ ధరించకపోతో రూ.1000 జరిమానా విధించనున్నట్టు తెలిపింది. విదేశాలనుండి వ చ్చిన ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అవటం వలన ప్రభుత్వం యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వ ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు తెలిపారు.
యూకె, సింగపూర్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి 325 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో రాష్ట్రానికి చెందిన వారు 239మంది ఉన్నారు. వీరందరికి ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా యూకె నుండి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వస్తేనే ఆ వైరస్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విషయం తెలుస్తుందని వెల్లడించారు..
3 రోజుల్లోనే 24 దేశాలకు ఒమిక్రాన్
ఒమిక్రాన్ వేరియంట్.. 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకంటున్నామని తెలిపారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడంతో వైరస్‌ను అరికట్టొచ్చు. ఫంక్షన్స్, పండుగల్లో జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదు. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు జాగ్రత్త వహించాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉందని తెలిపారు.