జనగామ జిల్లాలో ఆర్‌టిసి బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి

పాలకుర్తి (CLiC2NEWS): జనగామ జిల్లాలో ఆర్‌టిసి బస్సును లారీఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని పాలకుర్తి మండల వావివాల గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, డిసిపి రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. మరణించిన వారు మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్ మండలం టిక్యా తండాకు చెందిన హేమాని, అతని భార్య, పాలకుర్తి మండలానికి చెందిన హసీమా గా గుర్తించారు.