వైఎస్ఆర్ జిల్లాలో ఆటోని ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

ముద్దనూరు (CLiC2NEWS): వైఎస్ ఆర్ జిల్లాలో ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లె వద్ద లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయలైన మరోవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతి చెందిన వారు ఎరగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి, సరస్వతి, ప్రేమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరు దత్తాపురం నుండి సొంతూరికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.