TS: స్పీకర్ పోచారం శ్రీనివాస్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మెదక్ (CLiC2NEWS) : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద వ్యక్తిని ఢీకొట్టింది. కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గమనించని వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా కాన్వాయ్ లోని ఓ వాహనం ఆ వ్యక్తిని ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా అసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి కాళ్ళకల్ గ్రామావాసిగా పోలీసులు గుర్తించారు. ఇతను కొన్ని సంవత్సరాల క్రితం వలస వచ్చి పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.