Manthani: విద్యుత్ వినియోగ దారుల సమస్యల పరిష్కార వేదిక

మంథని (CLiC2NEWS): మంథని సబ్ డివిజన్లోని మంథని, ముత్తారం, బేగంపేట్, కమాన్‌పూర్, ఎక్లాస్పూర్ సెక్షన్ పరిధిలోని గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగ దారుల సమస్యల పరిష్కారానికి మంథని కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద గురువారం రోజున ఉదయం 10.30 నుండి 1.00 గంట వరకు విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవాలని DE/OP పి. తిరుపతి క్లిక్ 2 న్యూస్‌కు తెలిపారు.
గురువారం జరగనున్న విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అథితిగా చైర్మన్ పి. సత్యనారాయణ, మెంబర్స్ కె తిరుమల్ రావు, ఆర్. చరణ్ దాస్, ఎస్ నరేందర్ మెంబర్స్ తో పాటు తదితర విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొననున్నారు.