నాచావుకు కారణం సిఎం..
లేఖ రాసి ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం..

అనంతపురం (CLiC2NEWS): తనకు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉన్న పిచ్చి అభిమానమే తనకు శాపమైందని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఎపిలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం చిన్న ముష్టూరురుకు చెందిన మల్లేష్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తర చావుకు సిఎం జగనే కారణమంటూ ఆదివారం ఐద పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఎన్నికల ముందు జగన్ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మాటలు నమ్మిన రమేష్.. ఈ ఏడాది, వచ్చే ఏడాది రద్దు చేస్తారంటూ పందేలు కాసేవాడు. దాంతో రూ. లక్షలు పోగొట్టుకొని అప్పలపాలయ్యాడు. బ్యాంకుల్లో, యాప్‌లలో రుణాలు పొంది, వాటిని తిరిగి చెల్లించలేకపోవడం, కుటుంబ పోషణ భారమైంది. దీంతో జీతాలు కూడా సరైన సమయానికి అందకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులపై సిఎం జగన్ కక్ష పెంచుకొని రకరకాల వేధింపులకు గురిచేస్తున్నారని, వారికి ఇచ్చిన ప్రతి మాటనూ తప్పుతున్నారన్నారు. ఉద్యోగులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అణగదొక్కలేదని, జగన్ మాత్రం ఉక్కుపాదం మోపుతున్నాడని లేఖలో తెలిపాడు. గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదని, ఇచ్చిన మాట నెరవేర్చమని అడుగుతున్నామన్నాడు. కనీసం జీతాలైనా ప్రతి నెలా 5వ తేదీ లోపు ఇస్తే బ్యాంకు వాయిదాలు చెల్లించే వీలుంటుంది. పిఆర్‌సి విషయంలో మమ్మల్ని సిఎం మోసం చేశరన్నాడు. మాజి సిఎం చంద్రబాబు ఉన్నపుడు 43% ఫిట్‌మెంట్ ఇచ్చారని.. మీరు అంతకంటే ఎక్కువ ఇస్తారనుకుంటే 23% ఇచ్చారని లేకలో పేర్కొన్నాడు.
ఉద్యోగులారా ఇది ఎన్నికల సమయం.. నాలాగా ఏ ఉద్యోగి చనిపోకుండా చూడండి. సిపిఎస్ రద్దు, ఒపిఎస్ అమలు, ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు నా అంతిమ కోరికని లేఖలో మల్లేశ్ రాశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి.. ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న మల్లేష్‌ను స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించి చికిత్సనందిస్తున్నారు.