ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

తిరుపతి(CLiC2NEWS) : రాజమండ్రి-తిరుపతి ఇండిగొ విమానంలో సాంకేతిక లోపం వల్ల బెంగళూరులో ల్యాండ్ అయింది. ఈ విమానం గంటలో తిరుపతి చేరుకోవాల్సి ఉండగా రెండుగంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టి తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండయ్యింది. ఈ విమానంలో ఎమ్మెల్యే రోజా, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు.
విమానం బెంగళూరులో ల్యాండ్ అయినతర్వాత ఎమ్మెల్మే రోజా ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. “వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్ చేశామని చెప్పిన సిబ్బంది, విమానాశ్రమంలో దిగిన తర్వాత సాంకేతిక సమస్యని తెలిసిందన్నారు. విమానంలోని ప్రయాణికులు ఒక్కొక్కరు రూ.5 వేలుకడితేనే దించుతామని ఇండిగొ సిబ్బంది డిమాండ్ చేశారు. ఇది కరెక్టు కాదు. ప్రయాణికులందరినీ మానసిక వేదనకు గురిచేశారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళతామని తెలియజేశారు”.