కళాశాల భవనం నుండి దూకి ట్రైని డాక్టర్ ఆత్మహత్య!

చెన్నై (CLiC2NEWS): తమిళనాడు, కాంచీపురం జిల్లాలోని ఓ మెడికాలేజ్ విద్యార్థి కాలేజ్ భవనంపైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి మెడికల్ కాలేజ్, ప్రైవేట్ ఆస్పత్రిలో చదువుతున్న ట్రైని డాక్టర్ షెర్లిన్ ఆదివారం రాత్రి కాలేజి క్యాంపస్ భవనం ఐదో అంతస్తులో ఉన్న కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె గత కొంతకాలంగా డ్రిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే ఆమె కిటికీలో కూర్చున్నప్పటి దృశ్యాలను కొంతమంది విద్యార్థినులు వీడియో తీశారు. ఆమెను ఆపడానికి ప్రయత్నించగా .. షెర్లిన్ కిటికీ నుండి దూకిందని తెలిపారు.