శంషాబాద్ సమీపంలో బైక్‌ను ఢీకొన్న వ్యాన్.. ముగ్గురు మృతి

శంషాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. డిసిఎం వ్యాను బైక్‌ను ఢీకొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని పెద్ద షాపూర్ వద్ద ద్విచక్ర వాహనంను వెనుకనుండి వచ్చిన డిసిఎం వ్యాను ఢీకోట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్, కడియాల కుంటతండాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.