పాల‌కుర్తిలో అబ్దుల్ క‌లాం విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గామ (CLiC2NEWS): జిల్లాలోని పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం విగ్ర‌హాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టుద‌ల‌తోనే ఆసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిద‌ర్శ‌నం అబ్దుల్ క‌లామే అని అన్నారు. జీవిత‌మంతా శాస్త్ర‌వేత్త‌గా, విద్యావేత్త‌గా స‌మాజం కోసం పాటుప‌డిన మ‌హ‌నీయులు డా. ఎపిజె అబ్దుల్ క‌లాం అన్నారు. సామ‌న్య కుటుంబంలో జ‌న్మించిన కలాం బాగా చ‌దివి ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించార‌న్నారు. పాల‌కుర్తిలో ఆమ‌హ‌నీయుడు విగ్ర‌హం పెట్ట‌డం అభినంద‌నీయం అని మంత్రి అన్నారు.

అనంత‌రం ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థులకు మంత్రి స‌న్మానం చేశారు. ఉత్తమ సేవ‌లు అందించిన స్కూల్ అటెండ‌ర్‌ను స‌త్క‌రించారు. విద్యార్థుల‌తో క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు.

1 Comment
  1. have a peek at this website says

    Thanks for some other informative website. Where else could I am getting that kind of information written in such an ideal manner?

Leave A Reply

Your email address will not be published.