రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

చండీగఢ్ (CLiC2NEWS): పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఖోఖర్ గ్రామ శివారులో కారు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.