`ఆచార్య` విడుద‌ల వాయిదా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా ఉధృతితో ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్‌, రాధేశ్యామ్ సినామాలు విడుద‌ల వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఆచార్య మూవీ కూడా అదే బాట‌లో వెళ్లింది. ఈ మేర‌కు కొణిదేల ప్రొడ‌క్ష‌న్స్ అధికారికంగా ప్ర‌క‌టిస్టూ ట్విట్ట‌ర్‌లో పోస్టుచేసింది.

ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ఆచార్య సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. కానా క‌రోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. త్వ‌ర‌ల‌నే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ‌చ‌ర‌ణ్ న‌టించారు. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలందిచిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.