TS: ఎస్సీల అభివృద్ధికి దశల వారీ కార్యాచరణ అమలుకు సర్కార్ సిద్ధం
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన అఖిపక్ష భేటీ

హైదరాబాద్ (CLiC2NEWS): ఎస్సీ సాధికారతపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యతన ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశం జరిగింది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎస్సీల అభివృద్ధి కోసం దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై ఈ అఖిల పక్ష సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..
సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర అని చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా అఖిల పక్ష నేతలను సిఎం కోరారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకెళ్లేందుకు ఏం చేయాలో సూచనలు చేయాలన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత తామంతా తీసుకుందామని ముఖ్యమంత్రి తెలిపారు.