Adilabad: లారీలు ఢీ.. డ్రైవర్లు మృతి

ఆదిలాబాద్ (CLiC2NEWS): అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని 2 వాహనాల్లోని డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకుంది. జిల్లాలోని నేరడిగొండ మండలం రోల్‌మామడ వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీలు బలంగా డీకొనడంతో క్యాబిన్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.