పశ్చిమగోదావరి జిల్లా: హార్టికల్చరల్ యూనివర్సిటీలో ప్రవేశాలు

పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలో ఉన్న డా. వైఎస్ ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీతో పాటు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో 2025-26 సంవత్సరానికి గాను డిప్లొమాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పదో తరగతి లో అభ్యర్థులు సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తులను జూన్ 19వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుము రూ.1000 గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్ టి , దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.
రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ చిరునామాకు దరఖాస్తులను పంపించాలి.
రెండేళ్లే కాలవ్యవధి కలిగిన డిప్లొమా ఇన్ హార్చికల్చర్ ప్రోగ్రామ్‌లో 4 సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం సీట్లు 352 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ సీట్లు 220 కాగా.. అనుబంధ కళాశాలల్లో 132 సీట్లు ఉన్నాయి.
డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్ఏపింగ్ అండ్ నర్సరీ మేనేజ్‌మెంట్ ) 55 సీట్లు ఉన్నాయి.
15 నుండి 22 ఏళ్ల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.