యుజిసి నెట్ పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల
ఢిల్లీ (CLiC2NEWS): జనవరి 21, 27 తేదీలలో జరగనున్న యుజిసి నెట్ డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. జనవరి 3 నుండి 16 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. పండుగ సందర్భంగా జనవరి 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21,27 తేదీలకు రిషెడ్యూల్ చేశారు. వీటికి సంబంధించిన పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్‌టిఎ విడుదల చేసింది. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ , యూనివర్సిటిల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 85 సబ్జెక్టులకు గాను ఈ నెల 3నుండి 16 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష కోసం డిసెంబర్ 11తేదీ వరకు దరఖాస్తలు స్వీకరించారు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటి పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులపై అభ్యర్థి ఫోటో, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ ను చెక్ చేసుకోవాలని యుజిసి సూచించింది. వీటిలో ఏది లేకపోయినా మరోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.