వ్యవసాయానికి పెద్దపీట: ఆర్థిక మంత్రి భట్టి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పద్దును రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పద్దును సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సింహబాగం అంటే రూ. 72,659 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇది రైతుల తలరాతలను మారుస్తుందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ఒక మైలు రాయిగా నిలుస్తుందని తన బడ్జెట్ ప్రసంగంలో భట్టి పేర్కొన్నారు.
అలాగే పిఎం పసల్ యోజనలో చేరాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. వరి రైతుకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.