Air India: 45 లక్షల వినియోగదారుల డేటా లీక్‌!

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎయిర్ ఇండియా ప్ర‌యాణికుల సేవ‌ల వ్య‌వ‌స్థ‌ను అందిస్తున్న `ఎస్ఐటిఎ`పై ఫిబ్ర‌వ‌రిలో సైబ‌ర్‌దాడుల జ‌రుగ‌డంతో కొంత మంది ప్ర‌యాణికుల వ్య‌క్తిగ‌త డేటా లీక్ అయిన‌ట్లు శుక్ర‌వారం ఒక అధికారిక ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది. క్రెడిట్‌ కార్డులు, పాస్‌పోర్టులు, ఫోన్‌ నంబర్లతో సహా కస్టమర్‌ డేటా మొత్తం సైబర్‌ దాడికి గురైనట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రకటిచింది. ఆగస్టు 2011 నుండి ఫిబ్రవరి 2021 వరకు రిజిస్టర్‌ అయిన 45 లక్షల కస్టమర్ల సమాచారం చోరీకి గురైందని చెప్పింది. ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా బయటపెట్టింది.

జెనీవాకు చెందిన ప్యాసింజర్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌ (సిటా)పై ఈ సైబర్‌ దాడి జరిగిందని…దీంతో ఇందులో పొందుపరిచిన జాతీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల పాస్‌పోర్టుల సమాచారంతో పాటు వినియోగదారుల పేర్లు, పుట్టిన తేదీ, కాంటాక్ట్‌ డేటా చోరీకి గురైనట్లు తెలిపింది. ఈ విషయాన్ని వినియోగదారులకు ఇమెయిల్‌ ద్వారా ఎయిర్‌ ఇండియా తెలియజేసింది.
క్రెడిట్‌ కార్డు ద్వారా డేటా లీకయిందని.. అయితే వ్యక్తిగత వివరాలు మాత్రమే తెలుసుకున్నారని వివరించింది. కార్డు వెనకల గల సివివి, సివిసి నంబర్లు మా డేటాలో లేనందున అవి చోరీ కాలేదని తెలిపింది.

ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించామని తెలిపింది. ప్ర‌యాణికులు త‌మ పాస్‌పోర్టులు మార్చుకోవాల‌ని సూచించింది. ఎయిర్ ఇండియాతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 45 ల‌క్ష‌ల ప్ర‌యాణికుల డేటా లీక్ అయిన‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.