ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ సవరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ
హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రాలలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్‌లను పరోక్షంగా తమ కంట్రోల్ లోకి తెచ్చుకొనే విధంగా ఈ ప్రపోజల్ ఉందని, సర్వీస్ రూల్స్ సవరణ రాష్ట్రాల హక్కులను హరిస్తుందని సిఎం లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య స్ఫూర్తికి ప్రతిపాదిత సవరణలు విరుద్ధం అని అన్నారు. ఆల్ ఇండియా సర్వీసులలోని ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ స్వరూపాన్నే మార్చేస్తాయని, అందుకు ప్రతిపాదిత సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఎం లేఖలో వెల్లడించారు.