తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరు పాస్..

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటన చేశారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో విద్యార్థులందరికీ కనీస మార్కులతో పాస్. చేస్తున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.
మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలుతీసుకున్నామని తెలిపారు. 4.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 49% మంది ఉత్తీర్ణలైనారు. ఈఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదన్నారు. పదివేల మంది విద్యార్థులు 95% మార్కులు సాదించారన్నారు. ఇంటర్ బోర్డు తప్పులేకున్నా నిందించటం, ఆందోళనలు చేయడం బాధాకం అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పార్టీలను పక్కన పెట్టి విద్యార్థుల భవిస్యత్తు గురించి ఆలోచించాలన్నారు. సిఎం ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ మినిమం మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నాం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించాలని అన్నారు.