ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనూ బూస్ట‌ర్ డోసుకు అనుమ‌తివ్వండి: మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కొవిడ్‌ బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి హ‌రీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్ర‌మే ప్ర‌భుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో బూస్ట‌ర్ డోసు ఇస్తున్నారని, తాజాగా 18 నుండి 59 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వారికి కేవ‌లం ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో మాత్ర‌మే బూస్ట‌ర్ డోసు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనూ బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని హ‌రీశ్‌రావు కోరారు.

తెలంగాణ‌లో 18 ఏళ్లు నిండిన వారికి 100% రెండు డోసులు పూర్త‌యిన‌ట్లు తెలిపారు. 15-17 ఏళ్ల వారికి 90% మొద‌టి డోసు, 73% రెండో డోసు పూర్త‌యింది. 12-14 ఏళ్ల వ‌య‌సు వారికి 78% వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్టు తెలిపారు. రాష్ట్రంలో బూస్ట‌ర్ డోసు తీసుకొనేందుకు సుమారు 9,84,024 మంది అర్హ‌త క‌లిగి ఉన్న‌ట్లు లేఖ‌లో మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

1 Comment
  1. situs judi slot online says

    It’s an amazing paragraph in support of all the web users;
    they will obtain benefit from it I am sure.

    my web blog :: situs judi slot online

Leave A Reply

Your email address will not be published.