జుట్టు రాలకుండా చేసే అద్భుతమైన చిట్కాలు..

1. కొబ్బరి నూనే 100 గ్రాములు
2. డాబర్ ఆమ్ల ఆయిల్ 50 గ్రాములు
3. ఒక టీ స్పూన్ మెంతులు నీటితో శుభ్రం గా కడిగి ఎండకు ఎండబెట్టి అరనించాలి.
పైవి మూడు కలిపి ఒక గాజు సీసాలో వేసి ఉంచి దానిని ప్రతి రోజు తలకు రాయాలి.
వారానికి రెండు సార్లు తలకు కుంకుండుకాయతో స్నానం చేయాలి.
- వేప నూనే 50 గ్రాములు తెచ్చుకొని ప్రతి రోజు ఆయిల్ వాసనను ఉదయం సాయంత్రం చూడాలి.లేదా షట్ బిందు తైలం రెండు ముక్కులలో రెండు చుక్కలు రాత్రి పడుకునేటప్పుడు వేసుకోవాలి.
- క్యారట్ బీట్రూట్ కలిపి ఈక్వల్ గా దానిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనే కలిపి వారానికి మూడు సార్లు పరిగడుపున తాగాలి.
- జింక్ వున్న ఆహార పదార్దాలు తినాలి.
- హీమోగ్లోబిన్ పెంచుకోవటానికి మంచి ఆహారం తినండి
- థైరాయిడ్, ప్రాబ్లమ్ వున్న వెంట్రుకలు రాలుతాయి.
- రక్తం తక్కువగా వున్న, సరైన ఆహారం అందకపోయినా హెయిర్ రాలుతాయి.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. ఎక్కువగా ఆలోచించకండి.
- ఎక్కువగా సెల్ చూడరాదు. నైట్ ఎక్కువ సేపు స్టడీ చేయరాదు.
- పిజ్జా, బర్గర్, స్నాక్స్, కూల్డ్రింక్స్, ఐస్ క్రీం, నాన్ వెజ్, వీటికి కొద్దిగా దూరంగా వుండండి.
- గ్రీన్ బఠాణి కూర వారానికి ఒకసారి తినండి. కానీ యూరిక్ ఆసిడ్ ఎక్కువ వున్న వారు తినరాదు.
వెంట్రుకలు రాలకుండా ఉండటానికి కింది జాగ్రత్తలు పాటించండి.
- అభ్యంగన స్నానం చేసిన తరువాత జుట్టును తుడుచుకోవాలి.
- కుంకుడు కాయతో తల స్నానం చేయాలి.
- తల స్నానంనకు ముందు తలకు మందారాకు మెత్తగా దంచి పెట్టుకోవాలి.
- తల స్నానం తరువాత సువాసన గా దూపం సాంబ్రాణి, వేసి ఆ పొగను తల జుట్టుకు చూపించాలి.
- తలకు ప్రతిరోజు నూనే రాయాలి.
- వెంట్రుకలను, గట్టిగా లాగటం, దువ్వటం కానీ చేయరాదు. చిక్కులు పడకుండా వెంట్రుకలను దువ్వాలి.
- రకరకాల షాంపూలు వాడరాదు.
- తలకు నూనే రాయటం వలన ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయి. చర్మమునకు చక్కని కాంతి కలుగుతుంది.
- చక్కని నిద్ర పడుతుంది
- తలనొప్పి, రాదు. వెంట్రుకలు త్వరగా రాలవు.
- డాన్డ్రఫ్ రాదు. వెంట్రుకలు త్వరగా తెల్లబడవు
- వెంట్రుకలు దృడంగా ఉంటాయి. జుట్టు పొడవుగా పెరుగుతుంది.
- ముఖం లో ఓజం, తేజం వస్తుంది. ముసలి ముఖం రాదు.
- కళ్ళకు చల్లదనం కలుగుతుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557