ముందస్తు చర్యలతో అంబర్‌పేటలో ముంపు తప్పిందన్న ఎమ్మెల్యే కాలేరు

గోల్నాక (CLiC2NEWS): రూ. కోట్లాది వ్యయంతో గత ఐదేళ్లుగా అంబర్ పేట నియోజకవర్గ వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో వరద నీటి పైప్ లైన్ పనులు ప్రక్షాళన చేయడం జరిగిందని.. అందువలనే అంబర్‌పేటలో ముంపు సమస్య తప్పిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆయన గోల్నాక డివిజన్ శాంతినగర్‌లో మంగళవారం డ్రైనేజి పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. అనంతరం బస్తీలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.