టిటిడి భ‌క్తుల‌కు మ‌రోఅవ‌కాశం..

తిరుమ‌ల (CLiC2NEWS)‌: ‌తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టిటిడి) స్వామివారి దర్వ‌నానికి రాలేకపోయిన భ‌క్తుల‌కు మ‌రోఅవ‌కాశం క‌ల్పిస్తుంది. ఎపిలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్డు, రైలు మార్గాలు స‌హితం కొట్టుకునిపోయిన విష‌యం తెలిసిన‌దే. కొన్ని రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేయడం జ‌రిగింది. దీంతో తిరుమ‌ల‌ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేని భ‌క్తుల‌కు టిటిడి ప్ర‌త్యేక ద‌ర్శ‌న స‌దుపాయాన్ని క‌ల్పించ‌నుంది. న‌వంబ‌రు 18 నుండి 30 వ‌ర‌కు టికెట్లు క‌లిగిన వారు, టిక్క‌ట్టు మార్చుకొనే స‌దుపాయం క‌ల్పించింది. టిటిడి వెబ్‌సైట్‌లో టిక్కెట్టు మార్చుకొని.. తిరిగి 6 నెల‌ల‌లోపు టిక్కెట్టు పొంద‌వ‌చ్చ‌ని టిటిడి అద‌న‌పు ఈఒ ధ‌ర్మారెడ్డి ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
శ్రీవారి మెట్ల మార్గం నాలుగు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నిర్మాణాలు దెబ్బతినలేదు. భ‌క్తులు నిర్భయంగా వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చు అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.