శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురకుమార దిసనాయకే

కొలంబొ (CLiC2NEWS): శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురకుమార దిసనాయకే ఎన్నికయ్యారు. శ్రీలంక అధ్యక్ష పదవికి శనివారం పోలింగ్ నిర్వహించగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. దిసనాయకే అత్యధిక మెజార్టి సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో 42.31% ఓట్లు మార్క్సిస్టు నేత కుమార దిసనాయకే సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. విపక్ష నేత సాజిత్ ప్రేమదాసకు 32.76% ఓట్లు పోలయ్యాయి. శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టి వెల్లడించింది.
[…] […]