AP: ఇంటర్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసింది. క‌రోనా ఉధృతి పెరుగుతున్న కార‌ణంగా హైకోర్టు సూచనల మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుప‌డిన త‌రువాత‌ ఇంటర్‌ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని ఆయ‌న‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.