AP: విశాఖలో ఎదురు కాల్పులు
ఆరుగురు మృతి

విశాఖపట్నం (CLIC2NEWS): ఈరోజు తెల్లవారుజామున కొయ్యూరు మండలం, తీగమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుదుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినారు. ఘటనా స్థలంనుండి ఏకే-47 తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నట్లు సమాచారం. తీగమెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.