AP: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం : నలుగురి పరిస్థితి విషమం

కృష్ణా (CLiC2NEWS): జిల్లాలోని విసన్నపేట మండలం ముతారాశి పాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విజయవాడకు తరలించారు. కూలీలంతా మామిడి కాయల కోతకు ట్రాక్టర్ ట్రక్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.