AP: తిరుమలలో భారీ వర్షం

తిరుమల (clic2news): తిరుమలలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో దాదాపు గటన్నర సేపు భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వానతో మాడవీధులు, రహదారులు అన్ని జలమయమయ్యాయి.