AP: దారుణం.. కర్నూలులో కుటుంబం ఆత్మహత్య

కర్నూలు (CLiC2NEWS): కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాతబస్తీ కడక్‌పుర వీధిలో భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాగా పది రోజుల కిందట ప్రతాప్ తమ్ముడు ప్రసాద్ భార్య కరోనాతో మృతి చెందింది. దీంతో మంగళవారం వరకు తమ్ముడి ఇంటి వద్దనే ఉన్నారు. అదే రోజు రాత్రి తమ ఇంటికి వచ్చారు. ఉదయం చాలా సేపటి వరకు ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన మొదటి అంతస్తులో ఉంటున్న మరో సోదరుడు వెంకటేశ్వర్లు తలుపు తట్టినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో లోపలకు వెళ్లి చూడగా కుటుంబ సభ్యులంతా విగత జీవులుగా పడి ఉన్నారు.
పాలల్లో విషం కలుపుకొని తాగిన ఆనవాళ్లు కనిపించాయి. అత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. కర్నూలు డిఎస్పీ మహేష్, 1వ పట్టణ సిఐ కళా వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.