AP: `పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజ్ లు అందివ్వాలి`

మండపేట(CLiC2NEWS): మండపేట మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు మాస్క్ లు, గ్లౌజ్ లు, శానిటైజర్ బాటిల్స్ వెంటనే అందజేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రెండవ దశ వైరస్ వ్యాప్తి ప్రభావానికి అనేక మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా పారిశుధ్య కార్మికులు ఎక్కడా వెనుకంజ వేయకుండా నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు పట్టణానికి ఎంతో అవసరం అన్నారు. ఈ క్రమంలో వారి యోగ క్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. కార్మికులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని అన్నారు. అలాగే కరోనా వేళ కార్మికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు. ఇందుకోసం మాస్క్ లు, గ్లౌజ్ లు, శానిటైజర్లు వెంటనే వారికి పంపిణీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ కు ఆయన లేఖ ద్వారా తెలియజేశారు. వీటికయ్యే ఖర్చు వచ్చే కౌన్సిల్ సమావేశంలో పెట్టాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.