AP: పిడుగుపాటుకు 4 జిల్లాల్లో 6గురు మృతి

అమ‌రావ‌తి (clic2news): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శుక్ర‌వారం ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురిసాయి. అలాగే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. వారిలో శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువకు చెందిన కందాపు మహాలక్ష్మునాయుడు (21), బమ్మిడి రాము (50) గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మరణించారు. చెట్టుపొదిలాం గ్రామంలో ఉపాధి హామీ లీ ఎ.నాగమణి (43) వ‌ర్షం రావ‌డంతో ఒక చెట్టు కిందకు వెళ్లింది. ఈ చెట్టుపై పిడుగు పడడంతో ఆమె దుర్మరణం చెందింది. అలాగే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మైపాడు వారి కండ్రిగ గ్రామంలో మాలపాటి సంపూర్ణమ్మ (45) పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలు విడిచింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చింతకుంట పొలాల్లో గొర్రెల కాపరి పెద్ద కుళ్లాయప్ప (65), ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం నలదలపూరులో గొర్రెల కాపరి యరగొర్ల మాధవ (20) దుర్మరణం చెందాడు. ఈ అకాల వ‌ర్సాలు,ఈదురు గాలుల వల్ల పలు చోప‌ట్ల పంటలకు నష్టం వాల్లింది. తిరుమలలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.