AP: రఘురామకృష్ణరాజుకు బెయిల్

ఢిల్లీ (CLiC2NEWS): ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. రఘురామ కృష్ణపై మోపిన అభియోగాలు కస్టడీలో ఉంచి ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. కేసు విచారణకు కనీసం ఒక రోజు ముందు పిటీషనర్‌కు నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నది. రఘురామ కృష్ణరాజును న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని తెలిపింది. పిటిషనర్ విచారణకు సహకరించాలని, మీడియా,సామాజిక మాధ్యమాలలో మాట్లాడకూడదని రఘురామను సుప్రీం కోర్టు ఆదేశించింది.