AP: పది, ఇంటర్ పరీక్షలు రద్దు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
`జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యం. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో చెబుతాం. ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయ లోపం లేదు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం“ అని మంత్రి తెలిపారు.