AP: 18 ఏళ్లు దాటి వారందరికీ ఉచిత వ్యాక్సిన్
రేపటి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

అమరావతి: టీకా విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటి అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 2, 04, 70, 364 మంది కరోనా టీకా ఫ్రీగా పొందగలుగుతారు. శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై సిఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, మెటెరో డ్రగ్స్ ఎండీలకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఎంపి మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ..
కరోనా కట్టడిపై సమావేశంలో విస్తృతంగా చర్చించాం.. మహమ్మారి కట్టడికోసం సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసకున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని సిఎం జగన్ నిర్ణయం తీసకున్నారు. రూ. 1600 కోట్ల నిధులు వెచ్చించి ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
అంతేకాదు, కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ విధిస్తాం. ఏపీ వ్యాప్తంగా శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తాం. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5గంటలవరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే, కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.“ అని మంత్రి తెలిపారు.