AP: 2024 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి

అమరావతి (CLIC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. భవిష్యత్తులో మంచినీటి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండదని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.