AP: 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌కు 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఈ వ్యాక్సిన్లు గురువారం వచ్చాయి. వీటిని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జూన్ 20 తర్వాత లాక్‌డౌన్ సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాలని స్పష్టం చేశారు. ఆయన కొవిడ్ కేసులు తగ్గుతున్నాసరే అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలన్నారు.