AP: ఆర్టీసీ ఉద్యోగులకు ఆస్పత్రి

90,000 మందికి సేవలందించే డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రిని ప్రారంభించిన సిఎం జ‌గ‌న్

అమరావతి(CLiC2NEWS):కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు కలిపి దాదాపు 90 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులకు సేవలందించేలా కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రిని సీఎం వైఎస్‌ జగన్‌  తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

మోడల్‌ డిపోగా రూపొందించిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్‌ డిపో కూడా సీఎం చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో ప్రారంభమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం కడపలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఏరియా ఆస్పత్రిని ప్రారంభించడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు కలిపి దాదాపు 90 వేల మందికి ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.