AP: APPSC Good News
గ్రూప్ -1 మినహా మిగతా అన్నిటికీ ఒక్కటే పరీక్ష

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌సర్వీస్ కమీషన్ (APPSC) నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలలో
గ్రూప్ -1 మినహా మిగిలిన వాటి పోస్టుల భర్తీ విధానంలో ప్రాథమిక పరీక్ష (PRELIMS) తొలగించాలని ఎపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకే పరీక్ష నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు గాను ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు ఉద్యోగ నియామకాలకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసినదే. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిలో నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెయిన్స్ పరీక్ష నిర్వహించేవారు. ఒకే రాత పరీక్ష నిర్వహించాలనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.